నాటుసారా స్థావరాలపై దాడులు
On
విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల బయ్యారం మండలంలోని కొత్తపేట , గంధంపల్లి, పలు గ్రామాలలో ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ చిరంజీవి మాట్లాడుతూ, నాటు సారా తయారు చేస్తున్న నలుగురునుండి 8 లీటర్ల సారాయి స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినాట్లు తెలిపారు. ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్సై మౌనిక , హెడ్ కానిస్టేబుల్ మధు, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు .



