పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివి : సర్పంచ్ నవీన్
విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండల్ కేంద్రంలోని సర్పంచ్ నవీన్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో99 రోజుల ప్రణాళికలో భాగముగా గ్రామ పంచాయతీ మహేశ్వరం కార్యాలయము నందు గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్ అధ్యక్షతన పంచాయతీ పాలక వర్గము గ్రామ పంచాయతీ సిబ్బందిని సన్మానించడం జరిగింది, అలాగే పంచాయతీ సిబ్బందికి కాస్మోటిక్స్ అయిన సబ్బులు , నూనెలు అందజేయడం జరిగింది, పారిశుద్ధ్య సిబ్బంది ఆరోగ్యం విషయములో గ్రామ పంచాయతీ కార్యాలయము ఆవరణలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయించడం జరిగింది.ఈ కార్యక్రమములో సర్పంచ్ నవీన్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి అని ,కార్మికులు గ్రామాన్ని తమ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రజలందరూ ఆరోగ్యముగా ఉంచేందుకు గాను గ్రామాన్ని శుభ్ర పరిచి,గ్రామంలో అంటూ వ్యాధులు ప్రబలకుండా గ్రామం అభివృద్ధిలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయము అని కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికులకు పంచాయతీ తరుపున మరింత మెరుగైన వసతులు కల్పిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమములో ఉపసర్పంచ్ జోరల రమేష్ వార్డు సభ్యులు టింగ్లికర్ బేబీ , పొల్కంసునీత,అవులకడి కిష్టమ్మ , స్వర్ణగంటి సంజీవ ,షేక్ అజమ్ , కాడమోని స్వాతి,వత్తుల శాలిని,కాకి పరమేష్,దిద్దెల శ్రీశైలం,ఆకుల వీరబాబు,సున్నం స్వప్న , జటావత్ రుకేష్, రెవెల్లె చంద్రమౌళి, నాయకులు సున్నం కృష్ణ , పంచాయతీ కార్యదర్శి సుజాత ,పల్లె దవాఖాన డాక్టర్ స్వప్న , హెచ్ ఏ ఎఫ్ డి జి లిల్లి ఆశ వర్కర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.



