ఆటో డ్రైవర్ల నిరసన

ఆటో డ్రైవర్ల నిరసన

విశ్వంభర, నారాయణగూడ : రాష్ట్రంలో సి.ఎన్.జి గ్యాస్ కొరతను వెంటనే నివారించాలని తెలంగాణ రాష్ట్ర ఆటో  డ్రైవర్స్ యూనియన్ జేఏసీ కన్వీనర్ బి.వెంకశం డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 25న ఇందిరాపార్క్ వద్ద వేలాది మంది ఆటో డ్రైవర్లతో భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. సోమవారం నారాయణగూడ చౌరస్తా వద్ద ఆటో డ్రైవర్లు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాట్లాడారు. వాహనాల్లో వినియోగించే సి.ఎన్.జి గ్యాస్ కు తీవ్ర కొరత ఏర్పడిందని, కొన్ని ప్రైవేట్ బంకుల్లో రూ.60 ఉన్న ధరను రూ.100 వరకు పెంచుతున్నారని ఆరోపించారు. గ్యాస్ కోసం గంటల తరబడి లైన్లో వేచి ఉండాల్సి వస్తోందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని గ్యాస్ కొరతను నివారించాలని కోరారు. కార్యక్రమంలో వి.ప్రవీణ్, ఎ.సత్తిరెడ్డి, ఎంఎ.సలీం, శ్రీకాంత్, యాదగిరి, జంగయ్య, ఎస్.అశోక్, మున్నూరు కృష్ణ, యం.నర్సింహా, యం.శ్రీనివాస్, కొమురెల్లి బాబు, ఉమర్ ఖాన్, మురళి తదితరులు పాల్గొన్నారు.

Tags: