పారిశుద్ధ్య కార్మికుల సేవలు అపూర్వం:సర్పంచ్ రేణుక నరేష్
On
విశ్వంభర,ఇనుగుర్తి:గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సేవలు అపూర్వమైనవని సర్పంచి బానోతు రేణుక నరేష్ కొనియాడారు.ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఇనుగుర్తి మండలం పెద్దతండా(సిఎం)కు చెందిన పారిశుద్ధ్య కార్మికులు బానోతు సరోజ,లావుడ్యా ప్రభాకర్ లను గ్రామ సర్పంచి బానోతు రేణుక నరేష్ ఆదివారం శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ గ్రామాల పరిశుభ్రత పారిశుద్ధ్య కార్మికులతోనే సాధ్యమవుతుందని వారు లేని గ్రామాలను ఊహించలేమన్నారు.నిజానికి వారికి ఎంత చేసిన తక్కువే అన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు భిక్షం,సంతోష్,నరహరి,లక్ష్మీ, నాయకులు బాలు,లచ్చిరాం,శంకర్,బాలు,బీకు, సీతు,వీరన్న, దేవేందర్, ఆలు తదితరులు పాల్గొన్నారు.



