ఏపీవోకు ఘనంగా సన్మానం

ఏపీవోకు ఘనంగా సన్మానం

విశ్వంభర, అనంతగిరి: గత కొన్ని సంవత్సరాలుగా అనంతగిరి మండలంలో ఉపాధి హామీ పథకం లో భాగంగా ఏపీవోగా విధులు నిర్వహించిన గోదేశి శ్రీనివాసరావును మండల పరిధిలోని వాయిల సింగారం గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాస్  ఆదివారం ఆ గ్రామంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఏపీఓ శ్రీనివాసరావు విధి నిర్వహణలో నిజాయితీగల వ్యక్తిగా పేరు పొందారని అన్నారు. మండల వ్యాప్తంగా ఉన్న ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ఉపాధి హామీ యొక్క సూచనలు పరిమితులు క్షుణ్ణంగా వివరించారని అన్నారు. అలాంటి వ్యక్తి మండలాన్ని విడిచి సూర్యాపేట జిల్లా డిఆర్డిఏ ఆఫీసుకు బదిలీ కావడం విచారమని ఆయన సేవలను కొనియాడారు. అనంతరం శాలువాతో ఆయనను సత్కరించి వీడ్కోలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ చైర్మన్ గుర్ర వెంకటేశ్వర్లు, గద్దె రఘు, కొల్లు సుబ్బారావు, చుండూరు మురళి, గడ్డం వీరబాబు, బుర్ర నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags: