సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

విశ్వంభర, పరిగి:  పట్టణంలో షిరిడి సాయిబాబా ఆలయం 22వ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే  రామ్మోహన్ రెడ్డి షిరిడి సాయిబాబా ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. సాయిబాబా ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బాదం అఖిల శ్రీనివాస్ గుప్తా, దేవేందర్ రెడ్డి, రాధకృష్ణారెడ్డి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags: