ముగిసిన ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు
విశ్వంభర, నిజామాబాద్: తొమ్మిది రోజుల పాటు ఎంతో వేడుకగా జరిగిన ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగిసాయి. యజ్ఞాచార్యులు అర్చక స్వాములు వేద పండితులు 108 కళశాల్లో అభిషేక గంగను తీసుకొచ్చి స్వామి వారికి ఉత్సవానంతర అభిషేకం చేసి బ్రహ్మోత్సవాలను ముగించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి మంగళా శాసనములతో శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవానాథ జీయరు స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలు అద్భుతంగా పరిపూర్ణం అయ్యాయి అని ఆలయ ప్రధాన ధర్మకర్త శ్రీ నరసింహ రెడ్డి అన్నారు. గ్రామ ప్రజల సహకారం మరువలేనిది అని అన్నారు. బ్రహ్మోత్సవాల్లో నర్సింగ్ పల్లి గ్రామస్తులతో పాటు జిల్లా నలు మూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి అని అన్నారు... రాబోవు రోజుల్లో ప్రతి ఏడు ఇంతకు మించిన ఉత్సాహంతో ఇంకా వేడుకగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని నరసింహ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తలు నర్సింహారెడ్డి దంపతులు, దిల్ రాజు దంపతులు, శిరీష్ రెడ్డి దంపతులు, విజయసింహా రెడ్డి దంపతులు, సినీ నటులు సురేందర్ రెడ్డి, బలగం మధు, మాజీ సర్పంచ్ సాయరెడ్డి, మాజీ ఎంపీటీసీ రాములు, ఫోటో గంగాధర్, నర్సారెడ్డి, నరాల సుధాకర్, ప్రవీణ్, పృథ్వి, నరహరి, బండి సాయిలు , రమేష్, భాస్కర్, రాజేశ్వర్, మురళి, అరుణ్, అరవింద్, భూం రెడ్డి, చిన్నయ్య, ఎర్రోళ్ల సాయిలు, యాజ్ఞాచార్యులు అనంత్ కుమార్చార్యులు, సంపత్ కుమారాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ కుమారాచార్యులు, విజయ్ స్వామి, అనిల్ స్వామి తదితరులు పాల్గొన్నారు.



