జీహెచ్ఎంసీ ఈ-వేస్ట్ మెగా డ్రైవ్‌కు విశేష స్పందన

జీహెచ్ఎంసీ ఈ-వేస్ట్ మెగా డ్రైవ్‌కు విశేష స్పందన

విశ్వంభర, హైదరాబాద్: రెండు రోజుల్లో 15 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాల గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల సక్రమ నిర్వహణకు జీహెచ్ఎంసీ చేపట్టిన ప్రత్యేక సేకరణ కార్యక్రమానికి పౌరుల నుంచి విశేష స్పందన లభించింది.ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మార్చి 14, 15 తేదీలలో నిర్వహించిన ఈ-వేస్ట్ మెగా కలెక్షన్ డ్రైవ్ ద్వారా నగరంలోని అన్ని 30 సర్కిళ్లలో కలిపి సుమారు 15 వేల కిలోల ఈ-వేస్ట్ సేకరించబడింది. పాత మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఛార్జర్లు, కీబోర్డులు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను పౌరులు పెద్ద సంఖ్యలో తీసుకొచ్చి అందజేశారు.110 కేంద్రాల్లో సేకరణ*ఈ నెల 14,15 తేదీల్లో  డ్రైవ్‌లో జీహెచ్ఎంసీ పరిధిలోని 110 సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అధికారులు, స్వచ్ఛ సాథీ వాలంటీర్లు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.పార్కుల్లో భారీ సేకరణజూబ్లీహిల్స్ సర్కిల్ పరిధిలోని జలగం వెంకటరావు పార్క్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో 450 కిలోల ఈ-వేస్ట్ సేకరించారు. ఇందులో పాల్గొన్న పౌరులకు 4,500 రివార్డ్ పాయింట్లు అందజేశారు.అలాగే కవాడిగూడ సర్కిల్ పరిధిలోని ఇందిరా పార్క్ వద్ద 510 కిలోల ఈ-వేస్ట్ సేకరించగా, పాల్గొన్న పౌరులకు కలిపి రూ.20,874 నగదు ప్రోత్సాహకం అందించారు.మొత్తం ఈ-వేస్ట్: 15,000 కిలోలుపెద్ద ఎలక్ట్రానిక్ పరికరాలు: 100 యూనిట్లుసేకరణ కేంద్రాలు: 110*కవరైన సర్కిళ్లు: 30*రివార్డ్ పాయింట్లతో ఆకర్షణఈ డ్రైవ్‌లో పౌరులు తీసుకొచ్చిన ఈ-వేస్ట్ పరిమాణం ఆధారంగా రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్ అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అధికారిక రీసైక్లింగ్ సంస్థలు అక్కడికక్కడే ప్రోత్సాహకాలు అందించడంతో పౌరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.అవగాహన కార్యక్రమాలుడ్రైవ్‌కు ముందు స్వచ్ఛ ఆటో టిప్పర్లు ఇంటింటికీ వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. సేకరణ కేంద్రాల్లో ప్రత్యేక బేనర్లు ఏర్పాటు చేసి, వచ్చిన ఈ-వేస్ట్ వివరాలను రిజిస్టర్లలో నమోదు చేశారు.తదుపరి డ్రైవ్‌లు*జీహెచ్ఎంసీ నిర్వహించనున్న తదుపరి ఈ-వేస్ట్ సేకరణ కార్యక్రమాలు:ఏప్రిల్ 11, 12 మే 9, 10పౌరులకు విజ్ఞప్తిఇళ్లలో ఉపయోగం లేని ఎలక్ట్రానిక్ వస్తువులను సాధారణ చెత్తలో వేయకుండా, అధికారిక ఈ-వేస్ట్ సేకరణ కార్యక్రమాల్లో అందజేయాలని జీహెచ్ఎంసీ పౌరులను కోరింది. దీంతో పర్యావరణ పరిరక్షణతో పాటు విలువైన పదార్థాలను రీసైక్లింగ్ ద్వారా తిరిగి వినియోగించుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

Tags: