రెడ్డి ఐక్యవేదిక యూత్ ఆధ్వర్యంలో త్వరలో అసెంబ్లీ ముట్టడి

రెడ్డి ఐక్యవేదిక యూత్ ఆధ్వర్యంలో త్వరలో అసెంబ్లీ ముట్టడి

విశ్వంభర, రామన్నపేట:రెడ్డి కార్పొరేషన్ నిధుల సాధనే లక్ష్యంగా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలను ముట్టడిస్తామని రెడ్డి ఐక్యవేదిక యూత్ అధ్యక్షుడు ఎలిమినేటి సుమన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల తర్వాతనే మంత్రివర్గం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమోదించారు. రెండు సంవత్సరాలు గడుస్తున్నా రెడ్డి కార్పొరేషన్ కు నిధులు కానీ, పాలక వర్గాన్ని కానీ ఏర్పాటు చేయలేదు. వెంటనే నిధులు కేటాయించి పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో రెడ్డి ఐక్య వేదిక యూత్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని, ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు కేటాయించి పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రెడ్డి యూత్ ఆధ్వర్యంలో చేపట్టే అసెంబ్లీ ముట్టడికి తెలంగాణ వ్యాప్తంగా యువకులందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.

Tags: