అమర్‌నాథ్ సేవా సమితి సేవలు దేశానికి ఆదర్శం

అమర్‌నాథ్ సేవా సమితి సేవలు దేశానికి ఆదర్శం

విశ్వంభర, సిద్దిపేట: అమర్‌నాథ్ సేవా సమితి అందిస్తున్న సేవలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలో అమర్‌నాథ్ సేవా సమితి చేపట్టనున్న భవన నిర్మాణానికి సంబంధించిన మోడల్ బ్రోచర్‌ను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమర్‌నాథ్ సేవా సమితి దేశంలోనే సేవా కార్యక్రమాల్లో ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. భక్తులకు, అవసరమైన వారికి సమితి అందిస్తున్న సేవలు  ప్రశంసనీయమని తెలిపారు. సమితి భవన నిర్మాణాన్ని చేపట్టడం ఆనందదాయకమని, భవనం నిర్మాణానికి తన వంతుగా  ఆర్థికసాయం అందిస్తానని హామీనిచ్చారు. సమితి చేపడుతున్న సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సమితి ఛైర్మన్ చీకోటి మధుసూదన్, అధ్యక్షులు కాచం కాశీనాథ్, ప్రధాన కార్యదర్శి గంజి రాములు, కోశాధికారి గోపిశెట్టి శరబయ్య, పీఆర్వో డా.మాంకాల నవీన్ కుమార్, భవన నిర్మాణ కోశాధికారి గుబ్బ లింగమూర్తి, తాజా మాజీ అధ్యక్షులు కార్తీవాడ లక్ష్మణ్, సలహాదారులు ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు గంప శ్రీనివాస్, జిల్లా శ్రీనివాస్, నల్ల నాగరాజం, ఇల్లెందుల చంద్రశేఖర్, చింత శ్రీనివాస్, పోశెట్టి శ్రీనివాస్, కొమరవెల్లి దుర్గాప్రసాద్, కటకం సత్యనారాయణ, అయిత నాగరాజు, మాడిశెట్టి భాస్కర్, చింత రాజేంద్ర ప్రసాద్, అయిత రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

Tags: