డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు అవసరం
- చెరుపల్లి సీతారాములు
విశ్వంభర, ఉస్మానియా యూనివర్సిటీ : భగత్ సింగ్ స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువత పోరాడాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ హైదరాబాదు సెంట్రల్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో భగత్ సింగ్ యువజనోత్సవాల సందర్భంగా గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం ఎన్‌సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు 2కే రన్ నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల పోరాట స్ఫూర్తిని యువత ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. సమాజంలో పెరుగుతున్న అసమానతలు, నిరుద్యోగం, మతోన్మాదానికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ యువత గంజాయి, డ్రగ్స్ బారిన పడకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను పూర్తిగా నిషేధించాలని కోరారు.కార్యక్రమంలో ఆర్.ఎల్. మూర్తి, లెనిన్, అశోక్ రెడ్డి, జావీద్, కొమ్ము విజయ్, సంగీత, మారన్న, సైదులు, పవన్, వెంకటరెడ్డి, రాజయ్య, సునీల్, రవి, నాగేందర్, రజనీకాంత్, అర్జున్, ప్రవీణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.



