బి.ఎన్. చరిత్ర తెలంగాణకు గర్వకారణం

బి.ఎన్. చరిత్ర తెలంగాణకు గర్వకారణం

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు భీంరెడ్డి నరసింహారెడ్డి చరిత్ర తెలంగాణ సమాజానికి గర్వకారణమని ఎంసిపిఐ(యు) నాయకులు పేర్కొన్నారు. 103వ జయంతి సందర్భంగా బాగ్‌లింగంపల్లిలోని ఓంకార్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ 1923 మార్చి 15న నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెంలో జన్మించిన భీంరెడ్డి నరసింహారెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ప్రజల హక్కుల కోసం పోరాడుతూ మూడు సార్లు పార్లమెంటు సభ్యుడిగా, రెండు సార్లు శాసనసభ్యుడిగా సేవలందించారని అన్నారు. ఆయన చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చడంతో పాటు సూర్యాపేటకు బి.ఎన్. పేరు పెట్టాలని, ట్యాంక్ బండ్‌పై విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు.కార్యక్రమంలో వల్లెపు ఉపేందర్ రెడ్డి, నార్ల చంద్రశేఖర్, వనం సుధాకర్, మాడిశెట్టి అరుణ్ కుమార్, తాటికొండ రవి, మాదం తిరుపతి, దేవపూజ మధు, గాదగోని సునీత తదితరులు పాల్గొన్నారు.

Tags: