నూతన వధూవరులకు శుభాకాంక్షలు

నూతన వధూవరులకు శుభాకాంక్షలు

విశ్వంభర,సిద్దిపేట: పారిశ్రామికవేత్త వంగ రాజేశ్వర్ రెడ్డి పలువురి వివాహా వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని బత్తుల శ్రీనివాస్, తూముల శ్రీనివాస్ యాదవ్ కూతురు, కీ.శే బెల్లె బాలకిషన్ కూతురు మౌనిక, నారాయణరావుపేట మండలానికి చెందిన బద్ద సాయికుమార్, చిన్నకోడూరు మండలంలోని కర్నె శ్రీకాంత్ రెడ్డి, సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూర్ గ్రామానికి చెందిన వల్లెపు నర్సింలు కూతురు శివాని వివాహా వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ దొరం రాజశేఖర్ రెడ్డి కూతురు రిహాన్షి పుట్టిన రోజు వేడుకలకు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. అనంతరం చిన్నకోడూరు మండల కేంద్రానికి చెందిన బైండ్ల ఎల్లవ్వ, జంగపల్లి రాములు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో బాధిత కుటుంబాలను పరామర్శించారు. రెండు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags: