ఎస్‌వీఎస్ కళాశాలలో ముగిసిన టెక్ స్ప్రింగ్ ఫెస్ట్ 2026 వేడుకలు
విశ్వంభర హనుమకొండ జిల్లా:-ఎస్‌వీఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన టెక్ స్ప్రింగ్ ఫెస్ట్ –2026 వేడుకలు ఎంతో ఉత్సాహభరితంగా నిర్వహించబడి విజయవంతంగా సోమవారం ముగిశాయి. ఈ మూడు రోజుల ఉత్సవాలలో మొత్తం 56 సాంకేతిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.ఫెస్ట్ ముగింపు సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిమ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ బోనపల్లి ప్రతీక్ హాజరై విజేతలకు రన్నరప్‌లకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చైర్మన్ డాక్టర్ ఎర్రబెల్లి తిరుమల రావు మాట్లాడుతూ మూడు రోజుల పాటు విద్యార్థులు చూపిన ప్రతిభ,సృజనాత్మకత క్రమశిక్షణను అభినందించారు.ఇలాంటి సాంకేతిక ఉత్సవాలు విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు.ఈ కార్యక్రమంలోవైస్ చైర్‌పర్సన్ ఎర్రబెల్లి సువర్ణ,డాక్టర్ హర్షిణి ఎర్రబెల్లి పాల్గొని విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ విద్యా సంస్థ అధ్యాపకులు, విద్యార్థులు,నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



