రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీక

రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీక

విశ్వంభర, బర్కత్ పుర: “రంజాన్ మాసం కేవలం ఒక మతానికి చెందిన పండుగ మాత్రమే కాదు. హైదరాబాదు నగరంలో అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి జీవించే గంగా–యమునా సంస్కృతికి ఇది ప్రతీక. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రంజాన్ కానుకల పంపిణీ కార్యక్రమం ద్వారా ముస్లిం సోదరీమణులు, సోదరులకు అండగా నిలవడం సంతోషంగా ఉందని ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోత రోహిత్, జిహెచ్ఎంసి మాజీ ఫ్లోర్ లీడర్  దిడ్డి రాంబాబు పేర్కొన్నారు. ఆదివారం అంబర్‌పేట నియోజకవర్గం బర్కత్పుర డివిజన్ చాపల్ బజార్ మస్తాన్ సాహెబ్ మస్జిద్‌లో రంజాన్ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాదు నగరంలో అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో పండుగలు జరుపుకునే సంప్రదాయం ఎంతో ప్రత్యేకమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు సహాయం అందించే పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు.రంజాన్ కానుకల ద్వారా మహిళలకు, పురుషులకు దుస్తులు అందజేయడంతో పాటు మస్జిద్‌లలో ఇఫ్తార్ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సామరస్యాన్ని మరింత బలపరుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో మస్జిద్ కమిటీ పెద్దలు షాహిన్ భాయ్, కార్యదర్శి అఫ్జల్ భాయ్, జాయింట్ సెక్రటరీ కలీమ్ ఖురేషీ, అద్నాన్, అబ్దుల్ రహీమ్, వేణుగోపాల్, మల్లేష్, దీపక్, సాయి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Tags: