మహిళా దినోత్సవ వేడుకలు

మహిళా దినోత్సవ వేడుకలు

విశ్వంభర, హిమాయత్‌నగర్ : హిమాయత్‌నగర్ డివిజన్‌లో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా హైదరాబాదు ప్రధాన కార్యదర్శి కేశబోయిన శ్రీధర్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సమాజానికి సేవలందిస్తున్న పారిశుధ్య కార్మిక మహిళలకు చీరలను పంపిణీ చేసి సన్మానించారు. సమాజం కోసం కష్టపడే మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, మాధవి, పి.ప్రసాద్, నర్సింగ్ ముదిరాజ్, నవీన్, కేశబోయిన కవిత, అర్జున్ సింగ్, తుల్జారామ్, కార్తిక్, వాణి, మనీలా, శాంతి, అభిషేక్ యాదవ్, నందు, శివ పాల్గొన్నారు.

Tags: