భద్రాచల రామయ్యకు బోగారం పట్టు వస్త్రాలు 

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన చేనేత కళాకారులు భద్రాది రామయ్య కళ్యాణ మహోత్సవానికి చేనేత పట్టు వస్త్రాలు  గ్రామ చేనేత కళాకారుల చేతి నైపుణ్యంతో నేసిన వస్త్రాలు పుణ్యక్షేత్రానికి ఇవ్వడానికి బోగారం గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ తన వంతు సహకారం అందిస్తున్నారు. ఈ సందర్భంగా భద్రాచలం దేవాలయం ఈవో దామోదర్ రావు పట్టు వస్త్రాలు తయారు చేసే చేనేత మగ్గాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో  చేనేత కళాకారుల సంఘం అధ్యక్షులు రాపోలు గణేష్, ఎలగందుల కరుణాకర్, గుర్రం శ్రీనివాస్, గుర్రం సంతోష్, మిర్యాల సురేందర్, నేరటి స్వామి, తదితరులు పాల్గొన్నారు.

🕒 17 Mar 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/bogaram-silk-cloths-for-bhadrachala-ramaiah/article-11429

Tags: