ఎస్వీఎస్ కళాశాలలో రెండో రోజు కొనసాగిన టెక్ స్ప్రింగ్ ఫెస్ట్..వైస్ చైర్ పర్సన్ ఎర్రబెల్లి సువర్ణ వెల్లడి

ఎస్వీఎస్ కళాశాలలో రెండో రోజు కొనసాగిన టెక్ స్ప్రింగ్ ఫెస్ట్..వైస్ చైర్ పర్సన్ ఎర్రబెల్లి సువర్ణ వెల్లడి

విశ్వంభర హనుమకొండ జిల్లా :-హానుమకొండ రామారం లోని ఎస్వీఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో రెండో రోజు ఆదివారం టెక్ స్ప్రింగ్ ఫెస్ట్ వేడుకలు నిర్వహించామని వైస్ చైర్ పర్సన్ డాక్టర్ఎర్రబెల్లి సువర్ణ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా వైస్ చైర్ పర్సన్ డాక్టర్ఎర్రబెల్లి సువర్ణ మాట్లాడుతూ విద్యార్థులకు సాంకేతిక విద్యతో పాటు సృజనాత్మకతను అభివృద్ధి చేసుకుని భవిష్యత్తులో  ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమానికి హాజరైన మమత హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ డాక్టర్ మాధవి మాట్లాడుతూ విద్యార్థులలో దాగివున్న ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి టెక్నికల్ ఫెస్టివల్స్ ఎంతోగానో ఉపయోగపడతాయని తెలిపారు.ఈ ఫెస్ట్లో గెలుపొందిన విద్యార్థులకు ఆమె బహుమతులు అందజేశారు.అనంతరం ఫెస్ట్ లో పాల్గొన్న డాక్టర్లు ఉషాకిరణ్,హర్షిణి ఈ ఫెస్ట్లో విద్యార్థులు ప్రదర్శించిన పలు టెక్నికల్,ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్లు,వర్క్ షాపులను పరిశీలించి విద్యార్థులను ప్రోత్సరించారు.అనంతరం విద్యార్థులు సాంస్కృతికకార్యక్రమాలు ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్ అధ్యాపకులు,సిబ్బంది పాల్గొన్నారు.

Tags: