యాత్రికులకు డబ్బులు తిరిగి ఇచ్చిన గాయత్రి టూర్స్ 

యాత్రికులకు డబ్బులు తిరిగి ఇచ్చిన గాయత్రి టూర్స్ 

  • మానస సరోవర యాత్ర ఆగిపోవడంలో సంస్థ ప్రమేయం లేదు
  • గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్  యజమాని భరత్ శర్మ 

విశ్వంభర, ఉప్పల్: గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 2024 సంవత్సరంలో మానస సరోవర యాత్ర కోసం యాత్రికుల నుండి డబ్బులు తీసుకొని ఆరోజు చైనా పర్మిషన్ ఇవ్వకపోవడంతో యాత్రను యాజమాన్యం నిలిపివేసింది. ఆఫీసులో పనిచేసిన మాజీ ఉద్యోగి అనిల్  యాత్రికులు ఇచ్చిన  డబ్బులతో ఉడాయించడంతో బాధితులు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ సంఘటనకు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యాజమాని భరత్ శర్మ జరిగిన తప్పిదానికి బాధ్యత వహిస్తూ యాత్రకు వెళ్ళలేని సుమారు 20 మంది యాత్రికులకు వారి డబ్బులను డిడి ల ద్వారా అప్పగించారు. ఇందులో సంస్థ తప్పిదం లేదని స్పష్టం చేస్తూ తమ వల్ల ఎవరికీ నష్టం జరగకూడదని, ఇలాంటి సంఘటనలు జరగడం విచారకరమని, జరిగిన సంఘటనకు తమ సంస్థ నైతిక బాధ్యత వహిస్తూ యాత్రికులు అందరికీ డబ్బులు తిరిగి ఇచ్చామని ట్రావెల్స్ యజమాని భరత్ శర్మ తెలిపారు.

Tags: