క్రీడా పాఠశాలల ఎంపికను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
విశ్వంభర, అనంతగిరి: క్రీడా పాఠశాలల ప్రవేశాల ఎంపికను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అనంతగిరి మండల కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ముత్తినేని కోటేశ్వరరావు ఓ ప్రకటన ద్వారా సూచించారు.2017 సెప్టెంబర్ 1 నుంచి 2018 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించి 2026-27 విద్యా సంవత్సరానికి గాను 4వ తరగతి చదువబోతున్న విద్యార్థులు ఈ ఎంపికకి అర్హులని తెలిపారు.ఆసక్తి,అర్హులైన విద్యార్థులు http://tgss.te langana.gov.com వెబ్సైట్లో ఎంపిక తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.ఎంపికలు సోమవారం అనగా నేడు మండల పరిధిలోని శాంతినగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపికలు ఉంటాయన్నారు.ఎంపికలకు హాజరయ్యే విధ్యార్థులు ప్రస్తుత పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్,పంచాయతీ కార్యాలయం నుంచి పుట్టిన తేదీ ధ్రువపత్రం,3వ తరగతి పురోగతి నివేదిక కాపీ,ఆధార్,కుల ధ్రువపత్రం,ఐదు పాస్పోర్ట్ సైజు ఫొటోలు తీసుకొని వెళ్లాలని ఆయన సూచించారు.కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లం ప్రభాకర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి నామా నరసింహారావుల నేతృత్వంలో మండలంలో కబడ్డీ తో పాటు ఇతర క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన అన్నారు.



