కాంగ్రెస్‌తోనే మైనార్టీల అభివృద్ధి
విశ్వంభర,సిద్దిపేట: మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పూజల హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫాలను ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పూజల, అత్తు ఇమామ్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మైనార్టీలను పట్టించుకున్న పాపానా పోవడం లేదన్నారు. రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి పదేండ్లు కేసీఆర్ ముస్లింలను మోసం చేశారని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలుచేసిన ముస్లిం రిజర్వేషన్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పారు. మైనార్టీలు అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో రాహుల్ గాందీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పయ్యావుల ఎల్లం, రియాజుద్దీన్, పూజల గోపి, మీసం మహేందర్, షాబుద్దీన్, వాహాబ్, గయాజుద్దీన్, రషద్, హర్షద్, విజయ్ డానియల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



