ఆర్చరీ పోటీలో వి. జోషిత ప్రతిభ

ఆర్చరీ పోటీలో వి. జోషిత ప్రతిభ

విశ్వంభర, హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లో నిర్వహించిన ఎన్‌టిపిసి నేషనల్ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్‌లో హైదరాబాదు కొండాపూర్ మహర్షి విద్యా మందిర్ పాఠశాల 10వ తరగతి విద్యార్థిని వి. జోషిత ప్రతిభ కనబర్చింది. కంపౌండ్ ఆర్చరీ విభాగంలో అద్భుత ప్రదర్శనతో తెలంగాణకు గౌరవం తీసుకువచ్చింది. మార్చి 7 నుంచి 15 వరకు జరిగిన పోటీల్లో జూనియర్ విభాగంలో స్వర్ణ పతకం, సబ్ జూనియర్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. జాతీయ స్థాయి ఎంపికలకు అర్హత సాధించేందుకు ఈ టోర్నమెంట్ ముఖ్యమైన ర్యాంకింగ్ ఈవెంట్‌గా నిర్వహించారు. కొంపల్లిలోని అరుణ్ ఆర్చరీ అకాడమీలో కోచ్ అరుణ్ కుమార్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందుతోంది. ఆమె విజయం పట్ల కోచ్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

Tags:  

Advertisement

LatestNews

పదవ తరగతిలో ప్రభంజనం సృష్టించిన హయత్ నగర్ కల్సా నారాయణ సి ఓ ఉన్నత పాఠశాల 
పదవ తరగతిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు డాక్టర్ వైభవ్ రెడ్డి అభినందనలు
పదవ తరగతి ఫలితాల్లో విశ్రా ది స్కూల్ విజయదుందభి 
యువత స్వయం ఉపాధితో ముందుకు సాగాలి. - తెలంగాణ  రాష్ట్ర  బీజేపీ అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు
సోమాజిగూడ యశోదలో అత్యాధునిక ‘గ్యాస్ట్రో’ చికిత్సలు.-డాక్టర్‌ పెద్ది కిరణ్‌ వెల్లడి.
చేనేతల వ్యూహాత్మక సమావేశం. - కేంద్ర ప్రభుత్వానికి గ్రౌండ్ రిపోర్ట్
అంగరంగ వైభవంగా సూర్యకుటీర్ వెంచర్లో చతుర్ద వార్షిక బ్రహ్మోత్సవాలు..తిరుమల దేవి వెల్లడి