కాంగ్రెస్ లో చేరికలు 

కాంగ్రెస్ లో చేరికలు 

విశ్వంభర, పరిగి: దోమ మండల పరిధిలోని బొంపల్లి బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ విజయ పవన్ యాదవ్ పరిగి పట్టణంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని విశ్వసించి కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం నాయకులు విభేదాలు పక్కన పెట్టి అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ చైర్మన్ యాదవ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతిరెడ్డి, మాజీ సర్పంచ్ కోళ్ల సురేష్, కాంగ్రెస్ నాయకులు మల్ రెడ్డి, బాల్ రాజ్, భాస్కర్, ఇంతియాజ్ ఖాన్, రమేష్, కృష్ణ, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Tags: