పబ్బు చంద్రయ్య మృతికి నివాళులు
On
విశ్వంభర, రామన్నపేట:యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల, ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన పబ్బు చంద్రయ్య అకాల మరణం చెందగా, విషయం తెలుసుకున్న ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పబ్బు చంద్రయ్య పార్ధీవ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో ఉప-సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, యువ నాయకులు సింగనబోయిన గణేష్ యాదవ్, రాస వెంకటేశం, రవ్వ నర్సింహా, గాలి నర్సింహా, పబ్బు నగేష్, గర్ధాస్ శ్రీకాంత్, గర్ధాస్ సాయి, గోళ్లేపల్లి యాదయ్య, చిన్నపాక సురేష్, తదితరులు పాల్గొన్నారు.



