ఏసీపీ, ఎస్ఐలకు గౌడ సంఘం పరామర్శ

ఏసీపీ, ఎస్ఐలకు గౌడ సంఘం పరామర్శ

విశ్వంభర,ఇనుగుర్తి:మండల కేంద్రం ఇనుగుర్తి కి చెందిన సీనియర్ నాయకులు కందునూరి కొమురయ్య గౌడ్ గౌడ్ సతీమణి ఉపేంద్ర ఇటీవల కన్ను మూసింది. దీంతో వారి కుమారులైన సంఘం గౌరవ సలహాదారులు ఏసీపీ నాగయ్య గౌడ్, ఎస్సై ప్రేమ్ కుమార్ గౌడ్ లను స్థానిక  కౌండిన్య గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతినిధులు ఆదివారం పరామర్శించారు.స్వర్గీయ ఉపేంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కొమరయ్యతోపాటు ఏసిపి,ఎస్ఐలను వారి కుటుంబ సభ్యులకు విధి ఎప్పుడు ఏమి చేస్తుందో ఎవరికి తెలియదని ఈ దుఃఖ సమయంలో అధైర్య పడవద్దని ధైర్య వచనాలు చెప్పారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కూటికంటి మధు గౌడ్, కోశాధికారి వేముల శ్రీనివాస్,ఉపాధ్యక్షులు కందునూరి శ్రీనివాస్,గడ్డం శ్రీకాంత్,ఉమ్మగాని వెంకన్న, కందునూరి రంగన్న,దుబ్బాక రవి, కందునూరి రవి,గడ్డం సునీల్, వేముల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: