సామాజిక అధికారమే కాన్సీరాం లక్ష్యం
విశ్వంభర, రామన్నపేట:యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, కక్కిరేణి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో బహుజన సామాజిక విప్లవకారుడు కాన్షిరాం 92వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి సామాజిక న్యాయ కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించి, సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సోమనబోయిన సింహాద్రి మాట్లాడుతూ, కాన్సిరాం బహుజన సమాజ్ పార్టీనీ స్థాపించి బహుజనులకు అధికారాన్ని అందించి, రాజ్యాధికార సాధనలో సమాజ్ వాది పార్టీ నాయకులైన మూలాయం సింగ్ యాదవ్ తో కలిసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారని, 1993లో అధికారాన్ని చేపట్టడంతో సామాజిక విప్లవానికి నాంది పలికినారని, ఇది దేశ చరిత్రలోనే ఊహించని పరిణామం అని, సాంప్రదాయక రాజకీయ శక్తులకు వణుకు పుట్టించిన విధంగా ముందుకు సాగిందని, పార్లమెంట్ పద్ధతిలో పేద, దళిత, మైనారిటీ, వెనుకబడిన తరగతులను అధికారం వైపు నడిపించ వచ్చునని రుజువు చేసినారని తెలిల్పారు. ఈనాటి సామాజిక ఉద్యమకారులకు వారి ఉద్యమం ఆదర్శంగా నిలిచిందని, పూలే, అంబేద్కర్, కాన్షీరామ్, మండల్ భావజాలంతో సామాజిక మార్పు సాధ్యమేనని తేలి పోయిందని, కుల గణన, రాజ్యంగ పరిరక్షణ, హక్కుల పరిరక్షణ, సామాజిక, ఆర్థిక, న్యాయ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినప్పుడే భారత రాజకీయాలలో కుల విముక్తి సాధ్యమవుతుందని సింహాద్రి అన్నారు. అనంతరం గ్రామ పెద్దలు కలిసి ప్రొఫెసర్ సింహాద్రిని సత్కారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త వేముల సైదులు, నూకల యాదయ్య, సోమనబోయిన ఆదినారాయణ, భాషకార్ల నరేందర్ రెడ్డి, శిగ రాజు గౌడ్, కన్నేబోయిన యాదయ్య, మల్లేష్, నరసింహ, అంకిరెడ్డి యాదయ్య ముదిరాజ్, నల్ల ప్రసాద్, యాదయ్య, స్వామి, చిర్రబోయిన సత్యనారాయణ, వేలిజాల నరసింహ తదితరులు పాల్గొన్నారు.



