రైతులకు తుంపర్ల సేద్యం పరికరాలు, కూరగాయల విత్తనాల పంపిణీ

రైతులకు తుంపర్ల సేద్యం పరికరాలు, కూరగాయల విత్తనాల పంపిణీ

విశ్వంభర,పరిగి:  పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యాన, పట్టు పారిశ్రామిక ఆధ్వర్యంలో రైతులకి తుంపర్ల సేద్యం పరికరాలు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ కూరగాయల విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పరిగి ఎమ్మెల్యే  టి.రామ్మోహన్ రెడ్డి  పాల్గొని రైతులకు పరికరాలు, విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం అన్నారు.రాయితీ పద్ధతిలో పరికరాలు, విత్తనాలు అందించడం ద్వారా పంట ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుడుముల వెంకటేష్, కౌన్సిలర్ యూసుఫ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చిన్న నరసింహులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: