కాంగ్రెస్ పార్టీలో మరో ఇద్దరు మంత్రుల మధ్య వివాదం..
ఢిల్లీకి చేరిన వరంగల్ జిల్లా రాజకీయం
- కాంగ్రెస్ పార్టీలో మరో ఇద్దరు మంత్రుల మధ్య వివాదం
- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన కొండా సురేఖ
- మేడారం టెండర్లలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుని, రూ.71 కోట్ల టెండర్ నుతన మనుషులకు ఇప్పిస్తున్నాడని కొండా సురేఖ ఫిర్యాదు
- తన శాఖలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పెత్తనం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన కొండా సురేఖ
విశ్వంభర,హైదరాబాద్: తెలంగాణ లో మంత్రులు అడ్లూరి, పొన్నం వివాదం మరువక ముందే..మళ్లీ ఇద్దరు మంత్రుల మధ్య లొల్లి మొదలైంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓ మంత్రిపై సీఎం రేవంత్ రెడ్డికి, అలాగే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వరంగల్ జిల్లా రాజకీయాలలో మంత్రి పొంగులేటి మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని అలాగే , మేడారం పనుల వ్యవహారాల్లో ఆయన సొంత కంపెనీలకు ఇచ్చుకున్న టెండర్ల వ్యవహారాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఫిర్యాదు చేసారు. ఇదే అంశం పై ఖర్గే తో ఫోన్ లో మాట్లాడిన కొండా మురళీధర్‌రావు, ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న అంశాలను సమగ్రంగా వివరించారు .
అలాగే కాంగ్రెస్ పార్టీ అధినాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్ లకు కూడా మేడారం పనుల వ్యవహరాలు, వరంగల్ జిల్లా రాజకీయాల్లో పొంగులేటి పెడుతున్న ఇబ్బందులను కొండా దంపతులు నివేదించిన్నట్టు సమాచారం . తమ జిల్లాలో, తన శాఖలో ఆయన పెత్తనం ఏంటని అధిష్టానంకు పిర్యాదు చేసారు. ఇద్దరు సీనియర్ మంత్రుల మధ్య తలెత్తిన ఈ వివాదంపై అధిష్ఠానం ఎలా స్పందిస్తుందోనని పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.



