పాఠశాలల్లో ఘనంగా హోలీ సంబరాలు
On
విశ్వంభర,ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తి లోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్, విజ్ఞాన్ హై స్కూల్ లలో ముందస్తుగా సోమవారం హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాల బాలికలు,టీచర్స్ సహజసిద్ధమైన కుంకుమలను,రంగులను చల్లుకొని ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అంతకు మునుపు వేర్వేరుగా జరిగిన సమావేశాలలో కరస్పాండెంట్ చిన్నాల కట్టయ్య యాదవ్,హెచ్ఎం గంజి అర్చన రెడ్డి విద్యార్థినీ,విద్యార్థులకు హోలీ పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ హోలీ కి ముందు ఒకరోజు హోలికా దహనం చేస్తారని, ఈ పండుగ స్నేహం,ఐక్యతకు ప్రతిబింబంగా నిలుస్తుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో పాఠశాల టీచర్స్ వెనగండ్ల చంద్రమోహన్, తోట అనిత, బోళ్ళ సుజాత, పింగిలి రమాదేవి, కారంపూరి అనూష, ఉడుత శ్వేత,కదిర రమ్య,శిరీష,అప్సర,నవ్య,షాహిని సులోచన బాల బాలికలు పాల్గొన్నారు.



