గంగపుత్రుల హక్కులను కాపాడండి
విశ్వంభర, హైదరాబాద్ : శిక్షణ, విద్య, ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టడం సమాజ అభివృద్ధికి అవసరమని, గంగపుత్ర విద్యార్థులకు వసతి, శిక్షణ వేదికలు అందించడం ముఖ్యమని ప్రొఫెసర్ సుదర్శన్ అన్నారు.హైదరాబాదు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాచకట్ల సురేష్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వార్షిక సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుల కబ్జా సమస్యను పరిష్కరించడం, బీసీ ఏ కుల హక్కులను రక్షించడం, దాతల సహకారంతో ట్రస్ట్ స్థాపించి పేద విద్యార్థులకు శిక్షణ అందించడం అవసరమని అన్నారు. సురేష్ మాట్లాడుతూ, “సభా తీర్మానాలను అమలు చేయడం సమాజ అభివృద్ధికి దోహదం చేస్తుంది” అన్నారు. గంగపుత్రులకు ఆత్మగౌరవ భవనం నిర్మాణం త్వరగా పూర్తి చేయడం, విద్యార్థులకు వసతి, శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించడం, చెరువుల కబ్జా సమస్య పరిష్కారం బీసీ ఏ కుల హక్కులను రక్షించడం, ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు సహకారం. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ గాలి సత్యనారాయణ, అంబటి యాదగిరి, అనుమాస సుధాకర్, డోలి విజయ్ కుమార్, పి. భాస్కర్, పి. మహీపాల్, ఎల్. బాలచందర్, జె. ప్రకాష్, టి. దామోదర్ తదితరులు పాల్గొన్నారు.



