స్కూల్ ఆవరణంలోని చెట్ల నరికివేత
On
విశ్వంభర, మహేశ్వరం: కందుకూరు మండలం జైత్వరం గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఆవరణంలో ఉన్న చెట్లను నరికి ట్రాక్టర్లు తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు., స్కూల్లో చెట్లును నరకమని ఎవరు చెప్పారు అని ప్రశ్నించగా, గ్రామ సర్పంచ్ చెట్లను నరకమన్నాడని, పొంతన లేని సమాధానం చెప్పారు. గ్రామ సర్పంచ్ ఎలాంటి పర్మిషన్ లేకుండా, గ్రామపంచాయతీ తీర్మానం చేయకుండా , స్కూల్ హెడ్ మాస్టర్ కూడా తెలియకుండా చెట్లను నరికించారని గ్రామస్తులు తెలిపారు. మొక్కలను నాటి పరిరక్షణ కాపాడాలి అని ఒక వైపు ప్రభుత్వం చెపుతుంటే.. దానికి విరుద్ధంగా పిల్లలకు నీడ లేకుండా స్కూలులో చెట్లు నరకడం వల్ల స్కూల్ పిల్లలకు నీడ లేకుండా చేశారు అని సర్పంచ్ బైరు కొండల్ రెడ్డి ని గ్రామస్తులు నిలదీశారు.



