కలెక్టర్ ను కలిసిన దిశ సభ్యులు

కలెక్టర్ ను కలిసిన దిశ సభ్యులు

విశ్వంభర,ఇనుగుర్తి:మానుకోట జిల్లాకు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ స్నేహ శబరీష్ ను మండల కేంద్రం ఇనుగుర్తికి చెందిన దిశా కమిటీ మెంబర్ గుజ్జునూరి బాబురావు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పప్పుల వెంకన్న సోమవారం కలెక్టర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాకు నూతనంగా వచ్చిన కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపినట్లు చెప్పారు. కొత్తగా ఏర్పడిన ఇనుగుర్తి మండల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలిపారు. వారితో పాటు గ్రామస్తులు  పాల్గొన్నారు.

Tags: