వార్డు మెంబర్లకు శిక్షణ 

వార్డు మెంబర్లకు శిక్షణ 

విశ్వంభర,  చింతపల్లి: మండల కేంద్రంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిధిలోని 11 గ్రామపంచాయతీల వార్డు సభ్యులకు శిక్షణా తరగతులు  సోమవారం నుండి 7వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో సుజాత తెలిపారు. ఈ యొక్క శిక్షణా తరగతులకు హాజరైన వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ చట్టం పైన ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆమె తెలియజేశారు. వార్డు మెంబర్లు, సర్పంచ్, ఉప సర్పంచ్ లతో మమేకమై గ్రామాలాభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ హిందూజా, ట్రైనర్స్ ఎస్.మురళీమోహన్, కె.బాలయ్య, సంతోష్, యూసఫ్, వివిధ గ్రామాల వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Tags: