ఇరాన్ పై దాడికి నిరసన

ఇరాన్ పై దాడికి నిరసన

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: ఇరాన్ పై  అమెరికా, ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యకర్తలు అమెరికా యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.  సీపీఐ(ఎం) పోలీస్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ అమెరికా ప్రపంచ దేశాలపై దాడులు చేస్తూ అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఉల్లంఘిస్తోందని విమర్శించారు. ఇరాన్పై దాడిని ఖండించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags: