5 నుంచి సోలో కళల ప్రదర్శన

5 నుంచి సోలో కళల ప్రదర్శన

విశ్వంభర, బషీర్ బాగ్: పునరాలోచన చిత్రాలు సోలో కళల ప్రదర్శన ఈనెల 5 నుండి 9 వరకు స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్స్, కావూరి హిల్స్ లో నిర్వహించన్నున్నట్లు ప్రముఖ చిత్రకారుడు లోగిశెట్టి నరేంద్రనాథ్ తెలిపారు. సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్రకారుడు శ్రీనివాస్ తో కలిసి నరేంద్రనాథ్ మాట్లాడారు. తాను వేసిన పెయింటింగ్స్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి డా.కే.వీ.రమణాచారి, గౌరవ అతిథులుగా పద్మశ్రీ ప్రొ.యాదగిరి రావు, డా.జీ.వై. గిరి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ పాల్గొంటారని తెలిపారు. గ్రాఫిక్స్, డ్రాయింగ్స్, యాక్రిలిక్, వాటర్ కలర్ ల్యాండ్ స్కేప్, ఆయిల్ పెయింటింగ్స్ ప్రదర్శించన్నున్నట్లు వివరించారు. తాను వేసిన పెయింటింగ్స్ కు జాతీయ అవార్డ్స్ వచ్చాయని వెల్లడించారు.

Tags: