ఘనంగా సంజీవరెడ్డి జన్మదిన వేడుకలు
On
విశ్వంభర, రాంనగర్ : మాజీ మంత్రి, వీఎస్టీ యూనియన్ ప్రెసిడెంట్ డాక్టర్ జి సంజీవరెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం హైదరాబాదు బాగ్ లింగంపల్లిలో కార్మికుల మధ్య ఘనంగా జరిగాయి. వివిధ రాష్ట్రాల నుండి కార్మికులు, కార్మిక సంఘాల నేతలు, పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై ఆయన జన్మదినం సందర్భంగా ఘనంగా సత్కరించారు. మాజీ ఎంపీ హనుమంతరావు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇతర ప్రజా ప్రతినిధులు ఆయనతో కేక్ కటింగ్ చేయించి సత్కరించారు. ప్రత్యేకంగా విఎస్టీ వర్కర్స్ యూనియన్ అడ్వైజర్ రాజయ్య, జనరల్ సెక్రటరీ పౌల్, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ నగేష్, శ్రీనివాస్ యాదవ్, చంద్ర శేఖర్ తదితరులు సంజీవరెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన కోసం కార్మికులు ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని అన్నారు



