హోలీ ఐక్యతను పెంపొందిస్తుంది
On
విశ్వంభర, ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తి లోని విజ్ఞాన్ హై స్కూల్లో సోమవారం విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు హోలీ సంబరాలను ముందస్తుగా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాల బాలికలు,టీచర్స్ సహజసిద్ధమైన కుంకుమలను,రంగులను చల్లుకొని ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అంతకు మునుపు జరిగిన సమావేశంలో హెచ్ఎం గంజి అర్చన రెడ్డి విద్యార్థినీ,విద్యార్థులకు హోలీ పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ హోలీ కి ముందు ఒకరోజు హోలిక దహనం చేస్తారని, ఈ పండుగ స్నేహం,ఐక్యతకు ప్రతిబింబంగా నిలుస్తుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వెనగండ్ల చంద్రమోహన్, తోట అనిత, బోళ్ళ సుజాత, పింగిలి రమాదేవి, కారంపూరి అనూష, ఉడుత శ్వేత,కదిర రమ్య, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.



