పాఠశాలలో ఫర్నిచర్ దగ్ధం
విశ్వంభర, చింతపల్లి: చింతపల్లి మండలం హోమంతాలపల్లి గ్రామంలోని యుపిఎస్ పాఠశాలలో గుర్తుతెలియని ఆకతాయిలు ఆదివారం రాత్రి ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి దగ్ధం చేశారు. హెచ్ఎం రమేష్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లి చూసే సరికి , గదుల్లోని టీచర్ కూర్చునే కుర్చీ, టెబుళ్లు ధ్వంసం అయి, కొందరి విద్యార్థుల పాఠ్యపుస్తకాలు దగ్ధమయ్యాయన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫర్నిచర్ విరగగొట్టి ధ్వంసం చేయడం ఇదేమి దుర్మార్గమని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ప్రధానోపాధ్యాయుడు రమేష్ ఫిర్యాదుతో పోలీసులు పాఠశాల ఆవరణకు చేరుకుని పరిశీలించి, త్వరలోనే ఫర్నిచర్ ను దగ్ధం చేసినటువంటి నిందితులను పట్టుకుంటామని ఎస్సై ముత్యాల రామ్మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వంగాల స్రవంతి రమేష్ మాట్లాడుతూ విద్యాలయాన్ని ధ్వంసం చేసినటువంటి నిందితులను త్వరలో పట్టుకొని శిక్షించాలని కోరారు.



