ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర హాస్టల్స్ కో-కన్వీనర్ గా యలమల గోపీచంద్

ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర హాస్టల్స్ కో-కన్వీనర్ గా యలమల గోపీచంద్

విశ్వంభర, దేవరకొండ :- అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ స్టేట్ హాస్టల్స్ కో-కన్వీనర్ యలమల గోపీచంద్ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేవరకొండ కి చెందిన యలమల శ్రీధర్ కుమారుడు గోపిచంద్ తెలంగాణ స్టేట్ హాస్టల్స్ కో-కన్వీనర్ గా నియమితులయ్యారు. ఈనెల | శంషాబాద్లో నిర్వహించిన ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభల సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వీరు గతంలో దేవరకొండ నగరం కార్యదర్శిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నల్గొండ విభాగ్ హాస్టల్స్ కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టినట్టు వివరించారు. అనంతరం గోపీచంద్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించిన ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థ అయినటువంటి విద్యార్థి పరిషత్ దేశప్రేమను  కేంద్రంగా ఉంచి, "జాతి ప్రధమ" అనే భావంతో పని చేసే సంస్థలో భాగమైనందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల సంక్షేమం మరియు విద్యారంగం, సంక్షేమ హాస్టల్స్ సమస్యలపై నిరంతరం పోరాడి సమస్యలు పరిష్కరించే విధంగా తన వంతు కృషిని అంకితభావంతో కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.

Tags: