యువతకు క్రీడా కిట్లు పంపిణీ
- క్రీడలతోనే సమగ్ర వికాసం : జంగపల్లి ఐలయ్య
విశ్వంభర, అక్కన్నపేట: యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడే లక్ష్యంతో అక్కన్నపేట మండలంలోని యువకులకు క్రీడా సామాగ్రి కిట్లను పంపిణీ చేసినట్లు హుస్నాబాద్ డివిజన్ రైతు ఆత్మ చైర్మన్ జంగపల్లి ఐలయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలు యువతను శారీరకంగా, మానసికంగా దృఢంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలను అలవర్చుకోవాలని, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. యువత అభివృద్ధికి అవసరమైన ప్రతి కార్యక్రమానికి తమ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.క్రీడా సామాగ్రి కిట్ల పంపిణీకి సహకరించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యువత సంక్షేమం కోసం మంత్రి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ బుర్ర ప్రభాకర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు భానోతు వెంకటేష్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, యువకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.