మౌలిక సదుపాయాలు  విస్తరింప చేయాలి 

మౌలిక సదుపాయాలు  విస్తరింప చేయాలి 

 విశ్వంభర,  ఘట్కేసర్ : మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పరిధిలోని వెంకటపురంలోని  బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శబరిమల గురు స్వామిల  అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో జిల్లా సమావేశం గురువారం నిర్వహించారు  ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ఉదారి సుదర్శన్ ముదిరాజ్ ఆధ్వర్యంలో   మేడ్చల్ జిల్లా వివిధ ప్రాంతాల నుంచి గురుస్వాములు  పెద్ద సంఖ్యలో హాజరై శబరిమల యాత్రకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.   ఈ సందర్భంగా  జాతీయ ప్రధాన కార్యదర్శి నాయిని బుచ్చిరెడ్డి మాట్లాడుతూ కేరళలోని శబరిమల    అయ్యప్ప స్వామి ఆలయానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కోట్లాది మంది భక్తులు ప్రతి సంవత్సరం దర్శనానికి వెళ్తున్నారని పేర్కొన్నారు. యాత్రికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని రవాణా, వసతి, తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ఆలయ పరిసరాల్లో అన్ని మౌలిక సదుపాయాలను మరింత విస్తరించాలని, ప్రభుత్వాలు, దేవస్థాన అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. హిందూ పండుగల సీజన్‌లో రవాణా చార్జీలను అనవసరంగా పెంచడం వల్ల భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర మతాలకు చెందిన యాత్రికులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లే హిందూ భక్తులకు కూడా సమానమైన గౌరవం, సౌకర్యాలు అందించాలని వారు డిమాండ్ చేశారు. మతపరమైన వివక్షకు తావులేకుండా అన్ని వర్గాల భక్తులను సమాన దృష్టితో చూడాలని ప్రభుత్వాలను కోరారు  అలాగే శబరిమల  యాత్ర సందర్భంగా ప్రత్యేక బస్సులు నడపడం, రైల్వే సేవలను పెంచడం, యాత్రికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టడం, వృద్ధులు మరియు మహిళా భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సమావేశంలో తీర్మానించారు  ఈ కార్యక్రమంలో శబరిమల అయ్యప్ప సేవా సమాజం తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి వి చంద్రశేఖర్, తెలంగాణ నంబోద్రి ప్రదీప్,కీసర అయ్యప్ప సొసైటీ అధ్యక్షులు బాల్ రెడ్డి, మేడ్చల్ గురు స్వామి సూర్య నారాయణ రాజు,  ఉప్పల్ అన్నదాత డాక్టర్ రాజు, చౌదరి గూడ గురు స్వామి దామోదర్ రెడ్డి,ఎదులాబాద్ గురుస్వాములు రాచకట్ల క్రిష్ణ, అబ్బోళ్ల వెంకటేష్,పలువురు గురుస్వాములు, అయ్యప్ప భక్తులు,హిందూ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం అయ్యప్ప స్వామి శరణు ఘోషల మధ్య భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ చేశారు.

🕒 12 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/infrastructure-should-be-expanded/article-16560

Tags: