కలెక్టర్ ఆదేశాలతో రోడ్డు తొలగింపు
విశ్వంభర, మహబూబాబాద్ : మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని బంధం చెరువు లో అక్రమంగా రోడ్డు వేసిన విషయమై మహబూబాబాద్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కలెక్టర్ తహసిల్దార్ ఇరిగేషన్ మున్సిపల్ అధికారులను పిలిచి చెరువులు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించడంతో అధికారులు బంధం చెరువు లో ఉన్న రోడ్డు ను తహసిల్దార్ రాజేశ్వరరావు, ఇరిగేషన్ ఏఈ భరత్, టౌన్ సిఐ రఘుపతి రెడ్డి, 19వ వార్డు కౌన్సిలర్ చిదిరాల అరుణ అందరూ జెసిబి లతో రోడ్డును తొలగించడం జరిగింది. ఇప్పటికైనా ఎవరైనా చెరువులను ఆక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ అధికారులు హెచ్చరించారు చెరువులకు ఎఫ్టిఎల్ హద్దులు నిర్ణయించి చెరువులను కాపాడుతామని మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులకు భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షలు సింగని అశోక్, కార్యదర్శి మానుకోట గంగపుత్ర ఫిషర్ మ్యాన్ సంఘం అధ్యక్షులు దేశపోయిన రాధాకృష్ణ, నడిగడ్డ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొప్పు వీరన్న, పట్టణ గంగపుత్ర సంఘం కార్యదర్శి కందరబోయిన ఉపేందర్, హనుమంతుని గడ్డ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గుర్రం వెంకన్న మత్స్యకార సభ్యులు తదితరులు పాల్గొన్నారు.