బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా మోదీ చిత్రపటానికి  క్షీరాభిషేకం

విశ్వంభర, మహబూబాబాద్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యబద్ధంగా అత్యధిక కాలం (4,399 రోజులు) దేశ ప్రధానిగా సేవలందించి, సరికొత్త చరిత్ర లిఖించిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సంబరాలు మిన్నంటాయి. భారతీయ జనతా పార్టీ  లీగల్ సెల్ మహబూబాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ప్రాంగణం వద్ద ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా లీగల్ సెల్ ప్రతినిధులు తుంపిల్ల శ్రీనివాస్ , నలుసాని ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధాని మోదీ హయాంలో దేశం అన్ని రంగాలలో అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతోందని కొనియాడారు. మోదీ మరిన్ని దశాబ్దాల పాటు దేశానికి సేవలందించాలని, ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక అర్చనలు, మంగళ హారతులు నిర్వహించారు. అనంతరం, మోదీ సాధించిన ఈ అరుదైన చారిత్రాత్మక విజయానికి సంఘీభావంగా ఆలయ ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి లీగల్ సెల్ నాయకులు, న్యాయవాదులు, అభిమానులు అత్యంత భక్తిశ్రద్ధలతో క్షీరాభిషేకం (పాలాభిషేకం) చేశారు. ఈ ఆనందోత్సవాల మధ్య కోర్టుకు వచ్చిన క్లయింట్లు, భక్తులు, స్థానిక ప్రజలకు పెద్ద ఎత్తున స్వీట్స్ పంపిణీ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ లీగల్ సెల్ న్యాయవాదులు పుల్లఖండం శ్రీనివాస స్వామి, గధే కమల్ కుమార్, బోనగిరి అమర్‌నాథ్ గుప్తా, దుదిమట్ల మహేందర్, సీనియర్ న్యాయమూర్తులు ఎన్వి చలపతిరావు, బోనగిరి రవీంద్ర గుప్తా, డెగల సత్యనారాయణ, వై చెన్నమల్ల రెడ్డి, బి. మోహన్ నాయక్ ,న్యాయదులు వీరన్న, ఉమ. మహేషర్ రావు, పలువురు సీనియర్ న్యాయవాదులు, మరియు నరేంద్ర మోదీ అభిమానులు పాల్గొన్నారు.

🕒 11 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/modis-film-was-celebrated-under-the-auspices-of-bjps-legal/article-16457

Tags: