సమన్వయంతో గ్రామాభివృద్ధికి బాటలు వేయాలి
- మూడు గ్రామ సభల్లో ఎంపీడీవో పార్థసారధి
విశ్వంభర, ఇనుగుర్తి: మండలంలో నిర్వహిస్తున్న గ్రామసభలు బుధవారంతో ముగిశాయి. కోమటిపల్లిలో సర్పంచి మద్దెల బిక్షపతి గౌడ్ అధ్యక్షతన, పాత తండా ఇస్లావత్ నరేష్,తారాసింగ్ తండా సర్పంచి నూనావాతు బద్రు అధ్యక్షతన జరిగిన గ్రామ సభలకు ఎంపీడీవో బండారు పార్థసారధి గౌడ్, ఎస్సై కరుణాకర్ తో పాటు లైన్ డిపార్ట్మెంట్ అధికారులు హాజరయ్యారు. సభలను ఉద్దేశించి ఎంపీడీవో మాట్లాడుతూ..డస్ట్ బిన్ కు సంబంధించిన పచ్చ, నీలం,ఎరుపు,నలుపు డబ్బాలలో ఏ ఏ చెత్త ఉంచాలో అవగాహన కల్పించారు. వైద్య,విద్య,పంచాయతీ గ్రామీణాభివృద్ధి,రెవిన్యూ, స్త్రీ శిశు సంక్షేమ,వికలాంగులు, వయోవృద్ధులు,గిరిజన, సాంఘిక సంక్షేమం,మైనారిటీ, స్వయం సహాయక సంఘాలు,మిషన్ భగీరథ,వ్యవసాయ, ఇరిగేషన్,ఫారెస్ట్ తదితర శాఖలలో గ్రామస్తులకు చెందిన అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సమన్వయంతో పరిష్కరించాలన్నారు. ఎస్సై కరుణాకర్ మాట్లాడుతూ గంజాయి తాగిన,విక్రయించిన కేసులు తప్ప ఉన్నారు. హెల్మెట్ ధరించి బైకు లు నడపాలని సూచించారు. ఆయా గ్రామాలలో ఉపసర్పంచ్ లు ఇస్లావత్ బాబు, నరేష్, ఆర్ ఐ ఎండి మున్వర్, ఐసిడిఎస్ సూపర్వైజర్ దుర్గ, పంచాయతీ కార్యదర్శి రమణ మూర్తి, ఏ ఈ ఓ భాస్కర్, చందులాల్, వార్డు సభ్యులు వివిధ పార్టీల నాయకులు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.