ఉచిత వైద్య శిబిరం
విశ్వంభర,సంస్థాన్ నారాయణపురం: తెలంగాణ గురుకుల పాఠశాల సర్వేలు పూర్వ విద్యార్థుల సౌజన్యంతో, సర్వేలు గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు,సిబ్బంది కి ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డా. బి నరేందర్ రెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు డా. ప్రసాద్, డా. విజయా రావు, పూర్వ విద్యార్థి డాక్టర్లు డా. యు.యాదగిరి, డా. జె. రాము, కామినేని దంత వైద్య కళాశాల మొబైల్ వైద్య బృందం పాల్గొని ఉచిత వైద్య, దంత సంబంధిత సేవలు అందజేశారు. పూర్వ విద్యార్థి వేణు కుమార్ ఉచితంగా మందులను అందచేశారు. ఈ కార్యక్రమంలో అల్యూమిని అధ్యక్షులు బి. నరేందర్ రెడ్డి, కోశాధికారి యన్. పురుషోత్తం రెడ్డి, సలహాదారులు మల్లేశం,యం.రాజశేఖర్ రెడ్డి, సీనియర్ సభ్యులు చెన్న రాజా, సతీష్, వేణుకుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.



