తమిళనాడులో మోదీ ‘ఎన్నికల’ శంఖారావం

తమిళనాడులో మోదీ ‘ఎన్నికల’ శంఖారావం

దక్షిణాదిలో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ తన వ్యూహాలకు పదును పెట్టింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా మధురాంతకం వేదికగా భారీ బహిరంగ సభతో శ్రీకారం చుట్టారు.

విశ్వంభర, నేషనల్ బ్యూరో: దక్షిణాదిలో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ తన వ్యూహాలకు పదును పెట్టింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా మధురాంతకం వేదికగా భారీ బహిరంగ సభతో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. "తమిళనాడులో అవినీతి రాజ్యమేలుతోంది.. డీఎంకే పతనం ప్రారంభమైంది" అంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచాయి.  ఈ బహిరంగ సభలో కూటమిలోని కీలక భాగస్వామి పక్షాలైన అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే, టీఎంసీ, ఏఎంఎంకే నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

డీఎంకే పార్టీలో ఎదగాలంటే అవినీతి చేయాల్సిందేనని, ఆ పార్టీ సిద్ధాంతమే దోచుకోవడం అని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. తమిళనాడు ప్రజలు ఇప్పటికే మార్పు కోరుకుంటున్నారని, డీఎంకే అహంకారానికి ఈ ఎన్నికల్లో స్వస్తి పలుకుతారని ధీమా వ్యక్తం చేశారు. సుపరిపాలన, ప్రాంతీయ ఆకాంక్షలకు గౌరవం ఇవ్వడం కేవలం ఎన్డీయే కూటమితోనే సాధ్యమని ప్రధాని స్పష్టం చేశారు. తమిళనాడులో ఈసారి త్రిముఖ పోరు నెలకునే అవకాశం ఉంది. ముఖ్యంగా నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం చేసిన నేపథ్యంలో, పాత మిత్రులను కలుపుకొని వెళ్తున్న మోదీ వ్యూహం ఎంతవరకు పారితుందో చూడాలి. మధురాంతకం సభలో జనసందోహం చూస్తుంటే ఎన్డీయే కూటమిలో కొత్త జోష్ కనిపిస్తోంది.

Read More  మీలాంటి పక్షపాతిని చూడలేదు..!!