ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ వివరాలు నమోదు చేసుకోవాలి 

ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ వివరాలు నమోదు చేసుకోవాలి 

విశ్వంభర, సూర్యాపేట: స్వీయ గణన గడువు ముగియడానికి ఈ నెల 10వరకు మాత్రమే సమయం ఉన్నందున, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ వివరాలను నమోదు చేసుకుని ఈ బృహత్ కార్య క్రమాన్ని విజయవంతం చేయాలని సూర్యాపేట చైర్ పర్సన్ మోరిశెట్టి నివేదిక కోరారు. స్వీయ గణన గడువు ఈ నెల 10వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో, జిల్లాలో  అవగాహన కార్యక్రమాలను వేగవంతం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జన గణన 2026'లో భాగంగా ఏర్పాటు చేసిన స్వీయ గణన గడువు ఈ నెల 10వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరుతూ  జిల్లా కేంద్రంలో మారథాన్ ర్యాలీ నిర్వహించారు. మారథాన్ ర్యాలీని ప్రారంభించిన అనంతరం చైర్ పర్సన్ మీడియాతో మాట్లాడుతూ స్వీయ గణన ద్వారా ప్రజలు తమ వివరాలను స్వయంగా, ఖచ్చితత్వంతో నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 10వ తేదీ లోపు ఆన్‌లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ప్రతి కుటుంబం తమ వివరాలను నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా ,  ఆర్డీవో ఆర్. వేణు మాధవరావు, సిపివో ఎల్. కిషన్, సూర్యాపేట, సెన్సస్ జిల్లా ఇన్‌చార్జి ఇస్లావత్ హోబాలాల్,  డీఎంహెచ్ఓ డాక్టర్ పెండెం వెంకట్ రమణ, మున్సిపల్ కమిషనర్ సిహెచ్. హనుమంత రెడ్డి, సూర్యాపేట, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది,మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.

Tags: