అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం

అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం

విశ్వంభర, జనగామ : జనగామ పట్టణ సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లంతా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా సీనియర్ నాయకులు జంగిటి విద్యానాథ్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే పార్టీని విజయతీరాలకు చేరుస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.​ ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ , మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపాయని ఆయన అన్నారు.మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగవంతం కావాలంటే కాంగ్రెస్ జెండా ఎగరాలని అన్నారు. నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి సారధ్యంలో పట్టణాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దు తామని ఓటర్లకు హామీ ఇచ్చారు.​రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి, హస్తం గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Tags: