చిన్ననాగారం ముత్యాలమ్మ హుండి లెక్కింపు
విశ్వంభర,ఇనుగుర్తి: మానుకోట జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలోని ముత్యాలమ్మ దేవస్థానం హుండీని బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామస్తుల సమక్షంలో లెక్కించారు. రూ.1 లక్ష 42 వేల 85లు నగదు, 226 గ్రాముల వెండి, 2 గ్రాముల బంగారం ఆదాయంగా వచ్చినట్లు దేవస్థానం మేనేజ్మెంట్ ప్రకటించింది. సంబంధిత నగదును ఆలయ అభివృద్ధికి వెచ్చించనున్నట్లు చెప్పారు.శివరాత్రి ముందు జరిగే బోనాల పండుగ పురస్కరించుకొని ఆలయ హుండీలను ఓపెన్ చేసి కౌంట్ చేసినట్లు లెక్కింపులో పాల్గొన్న వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తుమ్మనపల్లి సతీష్ చారి,వార్డు సభ్యులు బైరు వెంకన్న గౌడ్,నిడిగంటి చంద్రమౌళి, బైరు వినయ్ గౌడ్,ఎఫ్.ఎ గుర్రం సత్యనారాయణ గౌడ్,సీనియర్ గౌడ సంఘంనేత బైరు వెంకటయ్య గౌడ్, పంజాల వాసుదేవా గౌడ్,నాయకులు బైరు అశోక్ గౌడ్,బైరు శ్రీనివాస్ గౌడ్, కొయ్యడి యాకాంతం గౌడ్, మునిగంటి రాజు చారి,బైరు పటేల్ కొమురయ్య, నాయిని కొమరయ్య,దాసరి ప్రకాష్,బత్తెం సోమయ్య, ముత్యాల వెంకన్న, మాలె రమేష్,ఉడుత యాకాంతం,బైరు రమేష్,వడపల్లి కొండయ్య గౌడ్, బొబ్బల ముత్తయ్య,బైరు యాదగిరి గౌడ్, గుర్రం వెంకన్న,నిడిగంటి బిక్షపతి,బత్తిని యాదగిరి,మాదాటి రామమూర్తి,సందీప్ గౌడ్,చిర్రబోయిన కొమురయ్య, గుండాల దుర్గా స్వామి,కౌటం సాయిలు,భూక్య వెంకన్న,బైరు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.



