సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి మరోసారి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా
జగ్గారెడ్డి కోరిక మేరకు మరో 17 అదనపు తరగతి గదులు, ఆడిటోరియం షేడ్ నిర్మాణానికి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా
- జగ్గారెడ్డి వినతి మేరకు గతం లో 6 కోట్లతో 1000 మంది విద్యార్థులకు సరిపడా నూతన భవనం ఏర్పాటు
- మరో వెయ్యి మందికి సరిపడా అదనపు తరగతి గదులు కావాలని అరబిందో చైర్మెన్ నిత్యానంద రెడ్డి ని కోరిన జగ్గారెడ్డి
- జగ్గారెడ్డి కోరిక మేరకు మరో 17 అదనపు తరగతి గదులు, ఆడిటోరియం షేడ్ నిర్మాణానికి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా
- జగ్గారెడ్డి, నిర్మల తో కలిసి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ను సందర్శించిన అరబిందో డైరెక్టర్ సదానంద రెడ్డి
- త్వరలో ప్రారంభం కానున్న పనులు..
విశ్వంభర,సంగారెడ్డి: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి జగ్గారెడ్డి వినతి మేరకు సంగారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ను అభివృద్ధి చేసేందుకు అరబిందో ఫార్మా మరోసారి ముందుకు వచ్చింది. గతం లో ఆరు కోట్ల తో 1000 మంది విద్యార్థులకు సరిపడా జి ప్లస్ వన్ భవనాన్ని అరబిందో ఫార్మా నిర్మించింది. సంగారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేవలం సంగారెడ్డి నియోజకవర్గ విద్యార్థులే కాకుండా నారాయణ్ ఖెడ్, వికారాబాద్, బాన్స్ వాడ, పరిగి, జహీరాబాద్ ల నుండి విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు. ఇంకా డిమాండ్ ఉన్నప్పటికీ పూర్తి స్థాయి లో సౌకర్యాలు లేకపోవడంతో అడ్మిషన్ లు ఇవ్వలేకపొతున్నారు. ఇదే విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ జగ్గారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన జగ్గారెడ్డి వెంటనే అరబిందో చైర్మెన్ నిత్యానంద రెడ్డి ని సంప్రదించారు. అవసరమైన సిఎస్సార్ నిధులు ఇవ్వాల్సిందిగా కోరారు. జగ్గారెడ్డి వినతి మేరకు అదనపు తరగతి గదుల తో పాటు ఆడిటోరియం ఏర్పాటు చేసేందుకు అరబిందో ఫార్మా ముందుకు వచ్చింది. 
అందులో భాగంగా జగ్గారెడ్డి, నిర్మల తో కలిసి అరబిందో డైరెక్టర్ సదానంద రెడ్డి బాలికల జూనియర్ కళాశాల ను సందర్శించారు. కళాశాల ప్రిన్సిపాల్ సునీత తో సమావేశమయ్యారు. కళాశాల ఆవరణ లో ఉన్న ఖాళీ స్థలం లో మూడు అంతస్తుల్లో అదనపు తరగతి గదులు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని, త్వరలో బిల్డింగ్ ప్లాన్, కావాల్సిన అనుమతులు తీసుకుంటామని అరబిందో ప్రతినిధులు వివరించారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ 17 తరగతి గదులు అందుబాటులోకి వస్తే మరో వెయ్యి మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వగలమని కళాశాల ప్రిన్సిపాల్ సునీత సంతోషం వ్యక్తం చేశారు. కళాశాల అభివృద్ధికి తోడ్పడుతున్న జగ్గారెడ్డి, నిర్మల కు, అరబిందో యాజమాన్యానికి ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, నాయకులు, సంతోష్, కిరణ్ గౌడ్, కౌన్సిలర్ లు మహేష్, శ్రీకాంత్ గౌడ్ లు పాల్గొన్నారు.



